Koppula Eswar appointed as TBGKS president టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి Kavitha అవుట్

దేశం బోర్డర్ దాటితే చాలు.. కవితకి ఏదో ఒక రకంగా షాకిస్తోంది బీఆర్‌ఎస్. లాస్ట్ టైం అమెరికా పోతే.. ఆమె తన తండ్రికి సీక్రెట్‌గా రాసుకున్న లెటర్ బయటపెట్టి నానా రచ్చ చేశారు. ఇక ఇప్పుడు కొడుకు చదువు కోసం అమెరికా పోతే.. ఏకంగా 10 ఏళ్ల నుంచి ఆమె చేతిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్ష పదవి లాగేసుకున్నారు. పాపం కవితక్క ఇక మీదట బోర్డర్ దాటి అడుగు బయటపెట్టాలంటే.. బీఆర్ఎస్‌లో ఇంకేం జరుగుతుందో.. పార్టీ తనకి ఇంకెలాంటి షాకిస్తుందో అనే టెన్షన్ మొదలైందట. 


కవిత ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన చిన్నకొడుకును కాలేజీలో చేర్పించే పనిలో ఆమె అక్కడ బిజీగా ఉన్న టైంలోనే.. సడెన్‌గా 10 ఏళ్లుగ ఆమె అండర్లో ఉన్న 
టీబీజీకేఎస్.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ గౌరవాధ్యక్ష పదవిని లాగేసి.. బీఆర్ఎస్ పార్టీకే చెందిన ఇంకో లీడర్.. కొప్పుల ఈశ్వర్‌కి అప్పగించారు. ఈ షాకింగ్ అప్‌డేట్‌తో కవిత ఫుల్ సీరియస్ అవుతూ ఓ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్‌లో కొత్తగా టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కి శుభాకాంక్షలు చెబుతూనే..  కార్మిక చట్టాలకి విరుద్ధంగా పార్టీ ఆఫీస్‌లో ఈ ఎన్నిక జరగడం తప్పా? ఒప్పా? అనేది పక్కన పెడితే.. ఈ ఎన్నిక కంప్లీట్‌గా రాజకీయ కారణాలతోనే జరిగినట్లు కనిపిస్తోందన్నారు. ‘బీఆర్ఎస్‌లో కొన్నాళ్లుగా ఏం జరుగుతోందో మీకందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై ప్రజల అభిప్రాయాలని వివరిస్తూ.. ఆయనకి నేను వ్యక్తిగతంగా లెటర్ రాస్తే.. ఆ లెటర్‌ని నేను గతంలో అమెరికా వెళ్లిన టైం చూసి..  లీక్  చేశారు. నన్ను పార్టీకి దూరం చేయాలని కుట్రలు చేసే వాళ్లే అప్పుడు ఆ లెటర్ లీక్ చేశారు అండ్ ఇప్పుడు మళ్లీ నేను అమెరికాలో ఉన్న టైం చూసి.. నా పదవిని కార్మిక చట్టాలకి వ్యతిరేకంగా ఇంకొకరికి కట్టబెట్టారు’ అంటూ బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఆమె రిలీజ్ చేసిన ఈ లెటర్ తెలంగాణ జాగృతి లెటర్ హెడ్‌తో రావడం ఇక్కడ మరిన్ని స్పెక్యులేషన్స్‌కి కారణం అవుతోంది.


గతంలో కేసీఆర్‌కి కవిత రాసిన లెటర్ లీక్ అయినప్పుడే.. పార్టీలో కొన్ని దెయ్యాలున్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కవిత. అయితే ఆ దెయ్యాలెవరో చెప్పకపోయినా.. ఆమెని పార్టీ నుంచి బయటకి పంపించాలని.. కేటీఆర్, సంతోష్‌ బలంగా ట్రై చేస్తున్నారని కవిత సపోర్టర్స్ కొంతమంది  అప్పట్లో ఆరోపణలు చేశారు. విత కూడా పార్టీలో కేసీఆర్ తప్ప ఇంకెవ్వరి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసేది లేదని క్లియర్‌గా చెప్పారు. అంటే బీఆర్ఎస్ ఫ్యూచర్‌గా, కాబోయే సీఎం క్యాండిడేట్‌గా చూస్తున్న కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె యాక్సెప్ట్ చేయనట్లే కదా. ఇక బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత, కేసీఆర్‌కి అందరికంటే దగ్గరగా ఉండే వ్యక్తి, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావు కావాలనే కవితని టార్గెట్ చేశారని మొదటి నుంచి ఆమె అనుచరులు ఆరోపిస్తూనే వస్తున్నారు. ఈ ఆరోపణల్లో వేటినీ కవిత ఎప్పుడూ సమర్థించింది లేదు.. అలాగని ఖండించింది లేదు. కానీ కేసీఆర్‌కి కవిత రాసిన లెటర్ లీక్ అయినప్పటి నుంచి.. ఆమె ఎక్కడా బీఆర్ఎస్ కండువా కానీ.. బీఆర్ఎస్ లోగో కానీ, చివరికి బీఆర్ఎస్ లెటర్ హెడ్ కానీ వాడుతున్నట్లు కనిపించడం లేదు. రీసెంట్‌గా బీసీల కోసం చేసిన ధర్నాలో కూడా కంప్లీట్‌గా తెలంగాణ జాగృతి పేరుతోనే.. అదే కండువాలతోనే నిరాహార దీక్షకి దిగారు. ఇక ఇప్పుడు మళ్లీ జాగృతి లెటర్ హెడ్‌తోనే లెటర్ రిలీజ్ చేయడంతో పార్టీలో ఉన్న గొడవలు మళ్లీ బయటపడ్డాయి. ఇదే టైంలో అసలు నిజంగానే కవితని కావాలనే పార్టీ నుంచి బయటకి పంపించడానికే.. టీబీజీకేఎస్ పదవి నుంచి ఆమెని పక్కన పెట్టారా..? అనే అనుమానాలొస్తున్నాయి. దీనికి కారణం కూడా కవిత తన లెటర్‌లోనే చెప్పారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola