Koppula Eshwar Emotional: కార్యకర్తల సమావేశంలో కంటతడి పెట్టిన కొప్పుల ఈశ్వర్

Continues below advertisement

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఓటమిని ఇంకా జీర్ణించుకోలేని కార్యకర్తలు, నాయకులు... కొప్పుల ఈశ్వర్ ను హత్తుకుని ఏడ్చేశారు. వారందర్నీ ఓదార్చిన ఈశ్వర్... కొన్ని సందర్భాల్లో ఆయన కూడా కంటతడి పెట్టారు. ఓటమికి దళితబంధు, ప్రత్యర్థిపై సానుభూతిని కారణాలుగా ఈశ్వర్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంతా బలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram