Komatireddy Rajagopal Reddy Tweet on Revanth Reddy | రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి ఫైర్

సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేసిన ట్వీట్ తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. పాలమూరు బిడ్డ అయిన తాను పదేళ్ల పాటు సీఎంగా ఉంటాననిచెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు ఇష్టం ఉన్నా లేకపోయినా మరో పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనంటూ రేవంత్ హాట్ కామెంట్స్ చేసారు. ఈ వ్యాఖ్యలని రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. పదేళ్ల పాటు సీఎం కుర్చీలో ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ పేపర్‌లో హెడ్‌లైన్స్‌గా వచ్చాయి. పేపర్ కటింగ్స్‌ను షేర్ చేస్తూ రేవంత్ కామెంట్స్‌ను ఖండించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అని ట్వీట్ చేసారు రాజగోపాల్ రెడ్డి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola