Kidney Rocket in Hyderabad | హైదరాబాద్ లో వెలుగు చూసిన కిడ్నీ అమ్మకాల దందా | ABP Desam
మీ దగ్గర 50లక్షలున్నాయా...అయితే చాలు కిడ్నీ లు పాడైపోయినా పర్లేదు మార్చేస్తారు. వీళ్లకు పర్మిషన్లు ఉండవు. అసలు ఆ ఆసుపత్రిలో కిడ్నీ విభాగమే లేదు. అయినా కానీ గుట్టు చప్పుడు కాకుండా దందా నడిపేస్తున్నారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ఉన్న అలకనంద ఆసుపత్రిలో వెలుగు చూసిన షాకింగ్ విషయాలివి. తమిళనాడు నుంచి అమయాకులను ఒప్పించి తీసుకువచ్చి వాళ్లను కిడ్నీలను అవసరం ఉన్నవాళ్లకి ఎక్కువ రేట్లకు అమ్మకుంటున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు వైద్యశాఖ అధికారులు..పోలీసులు. సరూర్ నగర్ లోని డాక్టర్స్ కాలనీలో 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన అలకనంద ఆసుపత్రిలో ఇలా అక్రమమార్గంలో కిడ్నీ మార్పిళ్లు చేస్తున్నట్లు సమాచారం అందటంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే ఇన్ స్పెక్షన్స్ కి అధికారులు పోలీసులు వచ్చే టైమ్ కి డాక్టర్లంతా పరారయ్యారు. పేషెంట్స్ ను మరో ఆసుపత్రికి తరలించి హాస్పటల్ ను సీజ్ చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా వైద్యశాఖాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.