ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లేశారు...?
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు ఓటు వేయడం అధికార పార్టీని కలవరపెడుతోంది. టిఆర్ఎస్ కు మొత్తం 650 వరకు ఓట్లు రావాల్సి ఉండగా కేవలం 480 ఓట్లు మాత్రమే వచ్చాయి. అధికారికంగానే టిఆర్ఎస్ పార్టీకి 489 ఓట్లు ఉండగా సిపిఐ పార్టీ మద్దతు ఇచ్చింది. సీపీఐ కి 35 ఓట్లు ఉన్నాయి. అయితే ఇందులో కూడా ఎక్కువ మంది క్రాస్ ఓటింగ్ కు పాల్పడడం తో టీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది