KCR Walking In Hospital: మెల్లగా కోలుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్... హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కోలుకుంటున్నారు. యశోద హాస్పిటల్స్ లో వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం రీహ్యాబిలిటేషన్ లో ఉన్నారు. వాకర్ సాయంతో కేసీఆర్ మెల్లగా నడుస్తున్నారు. వైద్యులు అత్యంత జాగ్రత్తతో దగ్గరుండి ఆయనను నడిపిస్తున్నారు. అదే సమయంలో ఆయన రికవరీని అంచనా వేస్తున్నారు.