KCR Daughter Ramya Rao Interview | BRS ముక్కలవ్వడానికి కారణం కోవర్ట్ ఎవరంటే..!? | ABP Desam
బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తుఫాను సృష్టిస్తున్నాయి. "కోవర్టులపై కఠిన చర్యలు తీసుకోవాలి, పార్టీ అంతర్గత విషయాలు లీక్ చేసే వారిపై చర్యలు కావాలి" అంటూ ఆమె తీవ్ర స్థాయిలో అసమ్మతి వ్యక్తం చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ చర్చనీయాంశంగా మారాయి. కవిత గారు ఇలా బహిరంగంగా మాట్లాడేంత అసంతృప్తికి కారణమైన సంఘటనలేంటి? బీఆర్‌ఎస్ పార్టీలోని కోర్టులుగా వ్యవహరిస్తున్న వారెవరు? కేసీఆర్‌ను ప్రభావితం చేస్తున్న 'దెయ్యాలు' ఎవరు? కేటీఆర్, కవిత మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయి? కుటుంబ రాజకీయాల్లో ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు, కవిత వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తుండగా, కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావుతో ABP దేశం ప్రత్యేకంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ అంశాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇంటర్వూ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్.