కేసీఆర్ ఆ 4 సీట్లు ఎందుకు పెండింగ్‌లో పెట్టారు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖారావం పూరించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నోటిఫికేషన్ రాక ముందే జోరు పెంచారు. 119 స్థానాలకుగానూ 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాను రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్... ఈ నాలుగు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా చర్చలు సాగుతున్నాయని చెప్పిన కేసీఆర్... ఆ స్థానాలకు అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు. 115 స్థానాలకు కేండిడేట్లను ఖరారు చేసిన కేసీఆర్ నాలుగు స్థానాలను ఎందుకు పెండింగ్ లో పెట్టారు...?