KCR 22 Land Cruisers In Vijayawada: సీఎం రేవంత్ రెడ్డి ల్యాండ్ క్రూయిజర్ల విమర్శలపై బీఆర్ఎస్ కౌంటర్ ఏంటి..?
కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్లను విజయవాడలో పెట్టారని 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాటిని రీమోడలింగ్, రీడిజైన్ వంటి పనులకు ఇక్కడికే పంపించారంటూ కొన్ని విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిగో అవే ఇవి. ఇక్కడే ల్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీఎం చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్నారు. ఆ ల్యాండ్ క్రూయిజర్లు మీరు వాడరా అంటూ కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు.