Kawal Tiger Reserve | కవ్వాల్ అభయారణ్యంలో గిరిజనుల కష్టాలు | ABP Desam
Kawal Tiger Reserve | కవ్వాల్ అభయారణ్యం... నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల మధ్యలోని ఈ ప్రాంతంలో 34 గ్రామాలు ఉన్నాయి. అభయారణ్యం కోసం ఆ గ్రామాలను ఖాళీ చేస్తే ప్రత్యేక పునరావాసం కింద కుటుంబానికో పక్కా ఇల్లు, వ్యవసాయం చేసుకునే వారికి 2.32 గుంటల భూమి... భూమి వద్దు అన్న వారికి 15 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీతో నిర్మల్ జిల్లా కడెం మండల పరిధిలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజలు ఎన్నో తరాలుగా ఉంటున్న తమ ఊరిని, ఇళ్లను వదిలి స్వచ్ఛందంగా వచ్చేశారు. ఇక్కడ నివసించే మొత్తం 142 కుటుంబాల్లో అంతా ఆదిమ తెగలైన గోండు, నాయకపోడు తెగలకు చెందిన గిరిజనులే. అయితే ప్రభుత్వం వారికి నిర్మించి ఇచ్చిన పునరావాస గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి. గ్రామస్థులు ఏమంటున్నారు. ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్ కు వెళ్లి అక్కడున్న పరిస్థితులు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది