Telangana CM KCR: మళ్లొచ్చిన్నాడు మీ ఇంటి కాడ ఛాయ్‌ పొయ్యాలే.. రాధమ్మకు చెప్పిన సీఎం కేసీఆర్

Continues below advertisement

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రసంగంలో చమక్కులు, ఛలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. సామెతలతో దుమ్మురేపుతారు. తాజాగా కరీంనగర్‌ జిల్లా శాలపల్లిలో జరిగిన ‘తెలంగాణ దళితబంధు’ పథకం ప్రారంభోత్సవంలోనూ కేసీఆర్ నవ్వులు పూయించారు. దళిత బందు లబ్ధిదారుగా ఎంపికైన హుజురాబాద్‌ మండలం కనుకులగిద్దకు చెందిన కొత్తూరి రాధ, ఆమె భర్త మొగిలికి దళితబంధు చెక్కు, లబ్ధిదారు కార్డు సీఎం కేసీఆర్‌ స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మైక్‌ అందుకుని ‘ఏమ్మా ఈ డబ్బులతో ఏం చేస్తావ్‌’ అని అడగ్గా రాధ డెయిరీ పెట్టుకుంటానని చెప్పింది. ‘పాలు అమ్ముతవా? మంచిగా అమ్ముతవా? పక్కా మాట కదా’ సరదాగా ప్రశ్నించారు. ‘మళ్లొచ్చిన్నాడు మీ ఇంటి కాడ ఛాయ్‌ పొయ్యాలే’ అని సీఎం కేసీఆర్‌ అనడంతో సభికులతో పాటు సమావేశానికి హాజరైన వారందరూ ఘొల్లున నవ్వారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram