Watch: మంత్రి కేటీఆర్‌ని ఆపేసిన బీటెక్ విద్యార్థిని.. గట్టిగా ప్రశ్నించి మరీ అడ్డగింత, అంతా షాక్

సిరిసిల్లలో వరద సహాయక చర్యల గురించి పర్యటించిన మంత్రి కేటీఆర్‌కి వింత అనుభవం ఎదురైంది. స్నేహ అనే బీటెక్ స్టూడెంట్ మంత్రిని ఆపేసింది. తమ ఇంటి ముందున్న ట్రాన్స్ ఫార్మర్ సమస్యను కేటీఆర్ దృష్టికి తేవడానికి వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. అయితే కేటీఆర్‌ని కలవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ పెద్ద ఎత్తున ఉన్న రక్షణ సిబ్బంది ఉండడం వల్ల కేటీఆర్‌తో ఎక్కువ సేపు మాట్లాడ లేకపోయింది. అయితే తమ సమస్యలు వివరించడానికి కేటీఆర్‌కి ప్రయత్నిస్తుండగానే ముందుకు కదిలిన మంత్రిని గట్టిగా మాట్లాడి మరీ ఆపింది. మా సమస్య వింటారా లేదా అంటూ  ప్రశ్నించింది. దీంతో అవాక్కైన కేటీఆర్ కాస్త తేరుకొని ఓపికగా విని.. వారి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతికి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా.. నువ్వు ఇంత చిన్నగా ఉన్నావ్ బీటెక్ చదువుతున్నవా అమ్మాయ్.. అంటూ జోక్ చేసి అమ్మాయి చొరవని మెచ్చుకుని నవ్వారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన అక్కడి పోలీసులు, ఇతర ప్రజలు సైతం సమస్య పరిష్కారానికి స్నేహ చూపిన చొరవకి అభినందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola