Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డు చనక కొరటా బ్యారేజీ జైనథ్ టెంపుల్ మరియు జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం కాలనీ తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి సోయా మొక్కజొన్న రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వారితో ఏం మాట్లాడారు..? పత్తి తేమశాతం గురించి రైతులు ఏమన్నారు..? కలెక్టర్ తో ఆమె ఫోన్లో ఏం మాట్లాడారు..? జైనథ్ మండలంలోని చనాక కోరాట బ్యారేజీ సందర్శించి అక్కడి రైతులతో కలిసి పత్తి చేనులో కవిత పత్తి ఏరారు.. పత్తి ఏరే కూలి మహిళలు కవితతో ఏమన్నారు..? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం కాలనీ సందర్శించి ఆదివాసులతో మాట్లాడారు ఆదివాసీలు కవిత దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకెళ్లారు ఆమె అన్నారు..? జనం బాటా చేపట్టిన తెలంగాణ జాగృతి రానున్న రోజుల్లో ఈ పర్యటనను ఏ విధంగా కొనసాగించనున్నారు..? కొత్త పార్టీ గురించి ఆమె ఏం మాట్లాడారు..? ఈ అంశాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో abp దేశం f2f.