Kadem Project: కడెం ప్రాజెక్టు మరమ్మతులు వేసవికి పూర్తవుతాయా? ఈ వానాకాలంలో ఉద్ధృతిని తట్టుకుంటుందా?
Continues below advertisement
గతేడాది భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు ( Kadem Project ) పెద్ద ముప్పు నుండి బయటపడింది. గేట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రాజెక్టుపై నుండి వరదనీరు ప్రవహించి ప్రాజెక్టు డ్యామేజ్ కు గురైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో అధికారులు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) ప్రాజెక్టును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. వచ్చే వర్షాకాలంలో ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వేసవిలోగా ప్రాజెక్టు గేట్లు ఇతర మరమ్మతులు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే ప్రస్తుతం కడెం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది..? ABP దేశం గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం.
Continues below advertisement