Junior Doctors Agitation in Osmania: ఉస్మానియా హాస్పిటల్లో జూడాల నిరసన

Junior Doctors Agitation in Osmania: ఉస్మానియా హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంఘీభావం గా కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ లో జూనియర్ డాక్టర్లు కళ్ళకు బ్లాక్ క్లాత్ కట్టుకొని నిరసనకు దిగారు. గత ఆరు నెలలుగా స్టైఫండ్ తమకు రావడం లేదని అంటున్నారు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మించాలని ఆరేళ్లుగా కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్ లో స్థలం లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని, డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఉండటం లేదని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులకు సీట్లు పెంచుతున్నారు కానీ హాస్టల్స్ పెంచడం లేదన్నారు. వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని, తరచుగా వైద్యులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola