Jubilee Hills Polling Updates | పోలింగ్ బూత్ ల వద్ద ప్రధాన పార్టీల ప్రలోభాల గొడవ

Continues below advertisement

 జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంతంగా ప్రారంభమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నికలో 58మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 4లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2024లో 45శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఈ సారి అది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో సహా వచ్చి ఎల్లారెడ్డి గూడ శ్రీనగర్ కాలనీ 290 బూత్ లో మాగంటి సునీత ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు.షేక్‌పేట డివిజన్‌లోని ఓటు హక్కు వినియోగించుకున్న రాజమౌళి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వేసిన హైడ్రా కమిషనర్ ,   నవీన్ యాదవ్. అలాగే యాక్టర్ తనికెళ్ళ భరణి కుటుంబంతో సహా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola