Jubilee Hills By Election Counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు భారీ భద్రత ! | ABP Desam
యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం సెగ్మెంట్లో 4,01,365 ఓటర్లు ఉండగా ఇందులో 1,94,631 (48.49%) మాత్రమే ఓటు వేశారు. 10 రౌండ్లు, 42 టేబుళ్ల మీద కౌంటింగ్ ఉంటుంది. షేక్ పేట్ 1వ బూత్ తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్ తో కౌంటింగ్ ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది.మధ్యాహ్నం 2 గంటల లోపు జూబ్లీహిల్స్ MLA ఎవరో తేలనుంది. రెండు రోజుల క్రితం జరిగిన పోలింగ్‌లో 47శాతానికిపైగా ఓటింగ్ శాతం నమోదు అయింది. ప్రచారం హోరాహోరీగా సాగినా ఈ ఉపఎన్నికల విజయం ఎవర్ని వరిస్తుందో అని ఎవరు లెక్కలు వారు వేసుకుంటున్నారు. లోలోపల మథన పడుతున్నా బయటకు మాత్రం గెలుపు తమదేనంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సునీల్ యాదవ్ పోటీ చేస్తే బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత నిలబడ్డారు. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. పోటీలో ఎంతమంది ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంది. మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశారు. నెలరోజుల పాటు జోరుగా ప్రచారం సాగింది. అయితే పోలింగ్ రోజు 4,01,365 మంది ఓటర్లు ఉంటే, కేవలం 1,94,631 మంది మాత్రమే ఓట్లు వేశారు.