Indo American Love Story: ప్రేమికుల రోజు ముందు ఒక్కటైన ప్రేమజంట..!| ABP Desam
Love కి సరిహద్దులు లేవని నిరూపించారు ఓ ప్రేమ జంట. అబ్బాయిదేమో Telangana లోని Kothagudem. అమ్మాదేమో America. కొత్త గూడెంకు చెందిన టోని సిలస్...అమెరికా కు చెందిన జెస్సికా కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఇప్పుడు జంటగా మారారు. Kothagudem లోని Saint Andrews Church లో వీరివురి వివాహం జరిగింది. ప్రేమికుల దినోత్సవానికి ముందురోజే ఈ ప్రేమికులు జంటగా మారటం తమకు ఎంతో ప్రత్యేకమని చెబుతున్నారు.