YS Sharmila Arrest: పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల
పోలీసులతో YSRTP అధ్యక్షురాలు షర్మిల వాగ్వాదానికి దిగారు. దీంతో లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ ఆరోపించారు. కొందరు పోలీసులను తోసుకుంటూ షర్మిల ముందుకు దూసుకెళ్లారు. పోలీసులు కాసేపటి తర్వాత ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ స్టేషన్ కు తరలించారు.