ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..

Continues below advertisement

Transgenders as Traffic Police in Hyderabad | హైదరాబాద్ లో నేటి నుంచి 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ డ్యూటీలోకి రాబోతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీసు కమాండ్ ఆఫీస్​ ఆవరణలో ఆదివారం ట్రాఫిక్ ట్రాన్స్ జెండర్స్ తో డెమో నిర్వహించారు. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 39 మంది సెలెక్టెడ్ ట్రాన్స్ జెండర్లకు 15 రోజుల పాటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారు. సమాజంలో ట్రాన్స్ జెండర్లపై చిన్న చూపు లేకుండా ఉంటుందని సీపీ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి విప్లవత్మాకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దేశం మొత్తం ఇప్పుడు మీ వైపే చూస్తోందని అన్నారు.                                     

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram