ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

Continues below advertisement

తెలంగాణలోనూ ఒమిక్రాన్‌ కలవరం మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కరోనా కొత్త వేరియంట్‌ కేసులను హైదరాబాద్‌లో గుర్తించినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి హైదరాబాద్‌ (టోలిచౌకీ)కి వచ్చిన ఇద్దరి (24 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల వ్యక్తి)లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరిని కూడా టిమ్స్‌కు తరలించినట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌ నుంచి బెంగాల్‌కు వెళ్లిన ఓ కుటుంబంలోని ఏడేళ్ల బాలుడిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram