Telangana Assembly Protest : వీఆర్ఏ, మత్య్సకార, ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ ఒకేసారి | ABP Desam
Continues below advertisement
తెలంగాణ అసెంబ్లీ బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు యత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్ మత్స్యకార విభాగం, వీఆర్‌ఏ, ఉపాధ్యాయ సంఘాలు, రెడ్డి సంఘం నేతలు విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఇందిరాపార్కు నుంచి వందలాది వీఆర్‌ఏలు ర్యాలీగా అసెంబ్లీ వైపు బయల్దేరగా.. ట్యాంక్‌బండ్, రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్ పరిసరాల్లో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు.
Continues below advertisement