Talasani Srinivas Yadav| Mahankali Bonalu: తెలంగాణ ఏర్పాటు తర్వాత పండుగల విశిష్టత పెరిగిందని వ్యాఖ్య
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పండుగలు, ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శనం చేసుకున్నారన్నారు. జాతర నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ జులై 31న సన్మానిస్తామన్నారు.