Revanth Reddy: ‘మీకు సదువు ఎందుకురా, మీ మోహానికి బర్రెలు కాసుకోండి’

Continues below advertisement

Revanth Reddy on KCR రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో జరిగిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఇక్కడ రూ.125 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటు కోసం సీఎం భూమి పూజ చేశారు. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, షాద్‌నగర్, మధిర, కొడంగల్, ఖమ్మం, పాలేరు, వరంగల్, కొల్లాపూర్, అందోల్, మంథని, ములుగు, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్‌ ఘన్‌పూర్, చెన్నూరు, పరకాల, తుంగతుర్తి, మునుగోడు, నారాయణ్‌ ఖేడ్, దేవరకద్ర, నాగర్‌ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ (KCR) పై విమర్శలు చేశారు.                                  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram