Hyderabad Rains | భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం | ABP Desam

హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. ఈస్ట్ లో ఉప్పల్, ఎల్బీ నగర్ దగ్గర మొదలు పెట్టి..వెస్ట్ లో హైటెక్ సిటీ, మాదాపూర్, మియాపూర్ వరకూ భారీ వర్షానికి నగరం తడిసి ముద్దైంది. ప్రధాన రహదారులన్నీ ఇదుగో ఇలా కాలువలను తలపిస్తున్నాయి. నీళ్లు నిలిచిపోయిన చోట జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు. హైదరాబాద్ అంతటా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫ్లై ఓవర్ ల పైనా వర్షం నీరు నిలిచిపోయి కనిపిస్తోంది.  మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాలనీలోని అనేక ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరియైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్లపైనే నిలిచి, రాకపోకలకు ఆటంకం కలిగించింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ  చీఫ్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని, రక్షణ కార్యకలాపాలను పర్యవేక్షించారు. చిక్కుకున్న వ్యక్తులను బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola