Hyderabad Fire Accident: పెద్ద అంబర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లో వ్యవధిలోనే మంటలు గోదాం మొత్తం వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలముకున్నాయి. గోదాంలో భారీ శబ్దాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి.