Osmania PG Ladies Hostel: లేడీస్ హాస్టల్ లో అర్ధరాత్రి ఆగంతకుల చొరబాటు, పట్టుకుని చితగ్గొట్టిన విద్యార్థినులు

సికింద్రాబాద్ ( Secunderabad ) ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ ( Osmania PG Ladies Hostel ) లో అర్ధరాత్రి ఇద్దరు ఆగంతుకులు అలజడి సృష్టించారు. అర్ధరాత్రి బాత్రూం కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడి, విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. అమ్మాయిలు అప్రమత్తమై ఒకర్ని పట్టుకుని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. మరో దుండగుడు పారిపోయాడు. హాస్టల్ లో తమకు రక్షణ కరవైందని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola