Omicron తో జాగ్రత్త..! 90శాతం మందికి లక్షణాలే లేవు..
గడచిన రెండు రోజులుగా తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని ఇది మూడో వేవ్ ప్రారంభానికి సూచిక అని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన....నూతన సంవత్సర వేడుకలు ఇంటిలోనే జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసులు త్వరలోనే భారీగా పెరిగే అవకాశాలున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.