మసీదుకు హిందూ సంఘాలు, ముత్యాలమ్మ గుడిపై డీసీపీ సంచలన నిజాలు

Continues below advertisement

DCP Sadhana Rashmi Perumal Press Meet on Muthyalamma Temple Incident: ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనపై ఉత్తర మండల డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘శాంతియుతంగా హిందూ ధార్మిక సంఘాలు బంద్ కు పిలుపిచ్చారు. శాంతియుతమైన ర్యాలీ చేసే క్రమంలో 3000 మంది హాజరయ్యారు. ర్యాలికి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. వీహెచ్‌పీ బజరంగ్ దళ్ రెండు భాగాలుగా విడిపోయి ఒకరు మెట్రోపాలిస్, మరొకరు ముత్యాలమ్మ ఆలయం వైపుకి దూసుకొచ్చారు. ముత్యాలమ్మ దేవాలయం వైపు ఉన్న మసీదు వైపుకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులుగా తాము, కుమ్మరి గూడ బస్తీ వాసులు ఆందోళనకారులను సర్ది చెప్పే ప్రయత్నం చేశాము. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు,చెప్పులు విసిరారు. 5 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. పరిస్థితి చక్కదిద్దేందుకు లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. వారు అర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తాము. బయట నుండి వచ్చిన ఆందోళనకారులు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు’’ అని తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram