సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!
ఎంపీ ఈటల రాజేందర్ ముందు మూసీ పక్కన ఉంటున్న ఒక కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నా పేరు రాము, నేను ఆటో డ్రైవర్ ను. కష్టపడి ఆటో తోలుకుంటూ చిట్టీలు వేసి రూపాయి రూపాయి జమచేసి ఇల్లు కట్టుకున్న, అది పోతుందని భయపడి యాసిడ్ తాగాను. కాలనీ వాళ్లు మనిషికిన్ని పైసలు వేసి నన్ను బ్రతికించారు. ఇప్పుడు పనికి పోకపోవడంతో ఆటో కిరాయి కట్టలేదని ఆటో, నా సెల్ ఫోన్ గుంజుకు పోయిండ్రు. ఇల్లు కూడా గడవడం లేదు. నాకు ఐదో తరగతి చదివే బిడ్డ ఉంది. 35 ఏళ్లు రూపాయి రూపాయి కూడబెట్టి కష్టపడి కొనుక్కున్న ఇల్లు పోతుందని ఎటు ఏగలేక యాసిడ్ తాగి చచ్చిపోదాం అనుకున్నా. నేను మళ్ళీ కొనలేను, కట్టలేను.
నా జీవితం అయిపోయింది. ఇప్పుడు ఒట్టిగానే ఉంటున్న. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఆటో నడిపితే రోజుకు 800 నుంచి 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు ఎక్కేటోళ్లు లేరు. రేవంత్ రెడ్డి నువ్వు గెలవాలని 400 రూపాయలు ఛార్జి పెట్టుకుని వరంగల్ పోయి నీకు ఓటు వేసి వచ్చాను. ఆ విశ్వాసం మీదైనా మా ఇల్లు కూలగొట్టకుండ ఉండండి. అదొక్కటే కోరుకుంటున్నాను’’ అని అతను వాపోయారు.