Mallareddy University Protest: మల్లారెడ్డి వ్యవసాయ వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు, కారణం ఇదే..!
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని మల్లారెడ్డి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకట్రెండు సబ్జెక్టులు బ్యాక్ లాగ్స్ ఉన్న సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేయటంతో... వారంతా ధర్నాకు దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను, అలాగే వర్సిటీ సామగ్రిని దగ్ధం చేశారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సహా పలువురు కార్యకర్తలు అక్కడికి చేరుకోవటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.