Hyderabad Lightning Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam
హైదరాబాద్ నగరం భారీ ఉరుములు, మెరుపులతో వణికిపోయింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భాగ్యనగరం వీధులన్నీ జలమయం కాగా..తెల్లవారు జామున ఉరుములు నగరవాసులు భయభ్రాంతులకు గురిచేశాయి. ఉప్పల్, బోడుప్పల్, మియాపూర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో 100కు పైగా కిలో యాంపియర్స్ తో లైటినింగ్ స్ట్రైక్ అయినట్లు వెదర్ అప్ డేట్ యాప్స్ నోటిఫై చేశాయి. ప్రధానంగా ఉదయం 5.44 నిమిషాలకు మియాపూర్ మెట్రో సరౌండింగ్ ఏరియాలో 512కిలోయాంపియర్స్ తో లైటెనింగ్ స్టైక్ జరిగినట్లు వెదర్ యాప్స్ చూపిస్తున్నాయి. సాధారంగా 100కిలో యాంపియర్స్ దాటితేనే వాటిని వైల్డ్ హౌస్ షేకర్స్ అంటారు. ఆ ఉరుము దెబ్బకు ఇల్లు అంతా కదిలిపోతుంది అన్నమాట. బట్ 512 అంటే అన్ ఇమాజినబుల్. చూడాలి దీని మీద IMD ఏమన్నా అప్డేట్ ఇస్తుందేమో. భారీ వర్షాలకు రోడ్లు మీద వాహనాలు తిరిగే పరిస్థితులు కనిపించటం లేదు. మరో 24గంటల పాటు వర్షం ఇలాగే కురిసే అవకాశం ఉండటంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.