Laldarwaza Bonalu 2024 Special | హైదరాబాద్ లో చివరి దశకు చేరుకున్న బోనాల పండుగ | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLaldarwaza Bonalu 2024 Special |
హైదరాబాద్ లో బోనాల పండుగ చివరి దశకు చేరుకుంది. గత మూడు వారాలుగా జంట నగరాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఇక చివరి వారం.. అంటే నేడే పాతబస్తీ లోనీ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జతార అట్టహాసంగా మొదలైంది. ఈ రోజే రంగం, ఘటం కార్యక్రమం జరగనుంది. పాత బస్తీ లోని చార్మినార్, లాల్ దర్వాజ, మంగల్హాట్ మీదుగా ఈ ఘటాల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది.! ఏటా ఆషాఢమాసంలో బోనాల పండుగను జరుపుకుంటారు. హైదరాబాద్ లో ఈ బోనాలు గోల్కొండ లోని శ్రీ మహంకాళి అమ్మవారితో మొదలై... శ్రీ మతేశ్వరి ముత్యాలమ్మ ఊరేగింపుతో ముగుస్తాయి. హైదరాబాద్ లో ఆషాఢంలో బోనాలు చేసుకుంటుంటే... తెలంగాణలోని మిగతా జిల్లాల్లో మాత్రం శ్రావణంలో బోనాలు చేసుకుంటారు. ఆ రోజు ఊరంతా అక్కడే ఉంటుంది. చదువులు, ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా అక్కడికి వస్తుంటారు..!