మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

Continues below advertisement

‘‘రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది, కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోంది!! పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో.. పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ, అవినీతి పాలనే శాపం. తప్పులపై తప్పులు చేసి.. తీరా తగ్గిన ఆదాయంపై అధ్యయనం చేయాలని ఆదేశించడం.. ఏకంగా ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించడం.. మీ అజ్ఞానానికి మరో సజీవ సాక్ష్యం 

మీ అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధికి  బ్రేకులు వేసి.. పాతాళానికి పడిపోయేలా చేసిన పాపం ముమ్మాటికీ మీదే.. పది నెలల పాలనలో అన్ని రంగాలను ఆగం చేసింది మీరే.. మీ కూల్చివేతల మనస్తత్వంతో రియల్ ఎస్టేట్ కుదేలు. మీ నిష్క్రియాపరత్వంతో ప్రభుత్వ వ్యవస్థలన్నీ దిగాలు. మీ అవినీతి, అక్రమార్జనకు పెట్టుబడిదారులు బెంబేలు. అందిన కాడికి దోచుకో.. బావమరిది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. అనే మీ దోపిడీ విధానాలతోనే ఆర్థిక వృద్ధికి బీటలు. రాష్ట్ర రాబడి కన్నా.. మీ సొంత రాబడికే పెద్దపీట వేసే మీ దగాకోరు పాలసీలు, కుంభకోణాలకు తెరదించకుండా.. అధ్వాన్నంగా మారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ….మీరు వెయ్యి అధ్యయనాలు చేసినా.. రాష్ట్రానికి నో యూజ్..!’’ అని కేటీఆర్ అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram