KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?

Continues below advertisement

BRS Latest News: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపైన సంచలన ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి ఆయన సొంత శాఖలోనే ఆయన బావమరిదికి చెందిన శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ముంబయిలోని ఆదర్క్ స్కామ్ తరహాలోనే నువ్వు దొరికేశావని.. ఇక రాజీనామా తప్పదని కేటీఆర్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. శోద అనేది లాస్ట్ 2 ఇయర్స్ లో 2 కోట్లు మాత్రమే లాభం పొందిన ఒక చిన్న కంపెనీ అయితే.. 1,137 కోట్ల టెండర్ ఎలా ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజమని అన్నారు. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు. బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా  అనుకోవద్దని.. ఇక ఢిల్లీ లో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే అని కేటీఆర్ అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram