వీడియో: నా శవం మీద సెటిల్ చేసుకోండి, సికింద్రాబాద్‌లో మాధవీలత అరెస్ట్

Continues below advertisement

సికింద్రాబాద్ మొండా మార్కెట్ సమీపంలో ముత్యాలమ్మ అమ్మవారి గుడి వద్ద ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడంతో పెద్ద వివాదం చెలరేగుతోంది. దీంతో బీజేపీ నాయకురాలు మాధవీ లత గుడి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు మాధవి లతను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సికింద్రాబాద్ మొండా మార్కెట్లో ఉన్న అమ్మవారి గుడిలో విగ్రహాన్ని వంశం చేయడం చాలా దారుణం అని అన్నారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ల మతం ఇస్లాం మతం అని.. ఇంత జరిగినా పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. ‘‘మొదటగా హిందువులకు ఐక్యత ఉండాలి. మనలో మనకే ఐక్యత లేకపోతే ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటాయి. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి’’ అని మాధవీ లత డిమాండ్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram