Karthika Deepam Actor Manoj On Gun Fire Incident: సెలెబ్రిటీ క్లబ్ ఘటనలో ట్విస్ట్
ABP Desam
Updated at:
16 Jul 2023 11:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశామీర్ పేట్ లోని సెలబ్రిటీ క్లబ్ లో శనివారం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. తన భార్యతో మనోజ్ అనే వ్యక్తి కలిసి ఉండటాన్ని భర్త సిద్ధార్థ్ చూశాడు. వారిద్దరినీ నిలదీశాడు. ఈ క్రమంలో ఎయిర్ గన్ తో.... భర్త సిద్ధార్థ్ పై మనోజ్ కాల్పులు జరిపాడు. వాటి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.... వాళ్లు వచ్చి మనోజ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ మనోజ్.... కార్తికదీపం ఫేమ్ యాక్టర్ మనోజ్ అని నిన్న అంతా వార్తలు వచ్చాయి. అతనే కాల్పులు జరిపాడంటూ అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని, 2 రోజులుగా బెంగళూరులో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఘటనలో కాల్పులు జరిపిన మనోజ్.... ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అన్నట్టుగా తెలుస్తోంది.