మతిపోగొట్టే రాయల్ వింటేజ్ కార్స్, కార్స్ 'ఎన్' కాఫీలో చూసేద్దామా?

Continues below advertisement

సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన Cars 'n' Coffee ఈవెంట్ సందర్శకుల మన్ననలు పొందుతోంది. పాతకాలపు కార్లు, మోటార్ బైక్స్ ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచాయి. ఈ అరుదైన వాహనాలను చూడటానికి కార్ లవర్స్ తమ కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. 125కి పైగా పాతకాలపు కార్లు ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మెర్సిడెస్ బెంజ్, మారుతి సుజుకి, రోల్స్ రాయిస్ వంటి కార్ల సీరీస్ సందర్శకుల చూపులను కట్టిపడేస్తున్నాయి. 85 ఏళ్ల APX 110 మోడల్ కార్ ప్రత్యేకంగా అందరినీ ఆకర్షిస్తోంది.

కార్స్ 'ఎన్' కాఫీ వ్యవస్థాపకుడు దీపక్ గిర్ మాట్లాడుతూ, "నాకు చిన్ననాటి నుంచే కార్లపై ప్రత్యేక అభిమానం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆటోమోటివ్ రంగంలో పనిచేసిన అనుభవంతో, పునరుద్ధరణకు ఆసక్తి పెరిగింది. ఈ కార్యక్రమం మొదట సరదా కోసం ప్రారంభించినా, ఇప్పుడు ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు." అని అన్నారు. పురాతన వాహనాలు మన రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక గా నిలుస్తాయి. వీటిని కాపాడటం మన అందరి బాధ్యత అని తెలిపారు. 

ఈ కార్యక్రమానికి హైదరాబాద్, సికింద్రాబాద్, ఇతర ప్రాంతాల నుండి 600 మందికి పైగా సందర్శకులు తరలి వచ్చారు. కార్ల యజమానులతో సంభాషిస్తూ, ప్రతీ వాహనం వెనుక కథలను ఆసక్తిగా విన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram