Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

మెట్రో రైల్ (Hyderabad Metro Rail) రెండో దశ డీపీఆర్‌ల తయారీ పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ సీనియర్ అధికారులతో రివ్యూ చేశారు. హైదరాబాద్ ఎయిర్‌ పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్ లు మొదలైనవాటిపై సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామని, ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్‌ఎండీఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకి సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం హెచ్‌ఏఎంఎల్ ఎదురుచూస్తోందని ఎండీ ముఖ్యమంత్రికి తెలియజేశారు. మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్-చెక్ చేయాల్సి ఉంటుంది. రెండవ దశ మెట్రో కారిడార్‌ల కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం డీపీఆర్‌లను సమర్పించడానికి ఇది తప్పనిసరి. గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం, ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ ఇప్పుడు ఆరామ్‌ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి(బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola