Hyderabad GHMC Sweeper: ఓ పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లకు ఏబీపీ దేశం రిపోర్టర్ ఎందుకు మొక్కారు..? అంత ఘనత ఏం సాధించారు..?
బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో ఇరవై రెండేళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న డి.నారాయణమ్మ జీవితం.... జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్నా మారలేదు. కనీసం తలదాచుకునేందుకు గూడులేక, అల్లుడి ఇంట్లోనే ఆత్మాభిమానం చంపుకుని ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలీచాలని జీతం, మరోవైపు ఆర్థిక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాతీయ అవార్డు నారాయణమ్మతో ABP Desam స్పెషల్ ఇంటర్వ్యూ.