Heaters For Tigers In Zoo: జూపార్క్ లో అలర్ట్.. చలి నుంచి జంతువుల రక్షణకు ప్రత్యేక చర్యలు
ఉష్ణోగ్రతలు పడిపోవడంతో హైదరాబాద్ నగరంలో చలి విపరీతంగా పెరిగింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప జనాలు ఇల్లు వదలి రోడ్లపైకి రావడంలేదు. చుట్టూ చెట్లు విపరీతంగా ఉన్న జూపార్క్ లో చలితీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బయటకంటే రెట్టింపు స్దాయిలో జూపార్క్ లో చలి వణికిస్తోంది. ఈ పరిస్దితుల నుంచి జంతువులను రక్షించుకునేందుకు జూపార్క్ లో హీటర్స్ పెట్టక తప్పని పరిస్దితి ఏర్పడింది.