Ghatkesar 4 Year Baby Kidnap CCTV Visuals: కలకలం సృష్టిస్తున్న పాప కిడ్నాప్
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ EWS కాలనీలో నాలుగేళ్ల పాప మిస్సింగ్.... స్థానికంగా కలకలం రేపుతోంది. పక్కనే జగదాంబ థియేటర్ లో పని చేసే సురేష్ అనే వ్యక్తి.... ఇంటివద్ద ఆడుకుంటున్న పాపను కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ అంతట్నీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు.... నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మల్కాజ్ గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేష్ రెడ్డి.... తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు.