Fire Accident Near Yakutpura Railway Station: తృటిలో తప్పిన భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని యాకుత్ పుర ప్రాంతంలో నిన్న తెల్లవారుజాము భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే స్టేషన్ కు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మూడు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 11 కేవీ విద్యుత్ పోల్ దుకాణాలపై పడటంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం కాస్త ఊపిరి పీల్చుకునే అంశం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వారొచ్చి వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.