జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

Continues below advertisement

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్ఎస్వీ ప్యాబ్ ప్లాస్ట్రో ఇండస్ట్రీస్ పరిశ్రమలో విపరీతంగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలతో ఆ  ప్రాంతం కమ్మేసింది. నవంబర్ 26 మధ్యాహ్నానికి ముందు ప్రమాదం జరగ్గా.. సాయంత్రానికి కూడా మంటలు అర్పేందుకు సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. 20 వాటర్ ట్యాంకర్లు, 6 ఆరు ఫైర్ ఇంజన్లలతో  అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ప్లాస్టిక్ బ్యాగుల పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం లేదు. గత 7 గంటలుగా మంటలు పెరుగుతూనే ఉన్నాయి. ఫైర్ సిబ్బంది.. 7 ఫైరింజన్లు, 40 నీటి ట్యాంకర్లతో రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మూడు అంతస్తుల భవనంలో ఇప్పటికే రెండంస్తులు కాలిపోయాయి. కింది అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వాడే ముడి సరకును నిల్వ ఉంచారు.           

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram