Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలు

Telangana Latest News: తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నేత అయిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. ఉన్నట్టుండి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు.. పొంగులేటికి (Ponguleti Srinivas Reddy) చెందిన ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. సీఆర్పీఎఫ్‌ పోలీసుల (CRPF) భద్రత ఇస్తుండగా.. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు హైదరాబాద్ (Hyderabad News) లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇంటితో పాటు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో కూడా పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు చేసింది. నవంబర్‌ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతోపాటు హైదరాబాద్‌లోని (Hyderabad Latest News) నందగిరిహిల్స్‌‌లో ఉన్న ఇంట్లో కూడా  ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్‌ (Banjara Hills News) రోడ్‌ నంబర్‌ 10లో రాఘవా ప్రైడ్‌లోనూ సోదాలు చేశారు.   

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola