Dr. KA Paul House Arrested: హైదరాబాద్ లో కేఏ పాల్ ను గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు | ABP Desam
Continues below advertisement
Prajashanthi Party వ్యవస్థాపకుడు, ప్రముఖ మత ప్రబోధకుడు Doctor KA Paul ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే నిర్బంధించారు. జూన్ 2.... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా వేడుకలను బహిష్కరించాలంటూ కొన్ని రోజుల క్రితం కేఏ పాల్ అందరికీ పిలుపునిచ్చారు. ఇప్పుడు సరిగ్గా జూన్ 2వ తేదీనే కేఏ పాల్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం.... చర్చకు దారితీస్తోంది. అయితే హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారన్న విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కేఏ పాల్ ఇంటి ముందు మాత్రం పోలీసు బలగాలను మోహరించారు.
Continues below advertisement