చంద్రబాబుతో నాకు పోలిక అవసరం లేదు - రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2024 Hyderabad: మోదీ గారు మూడోసారి ప్రధాన మంత్రి అయ్యారు? నేను సవాలు విసురుతున్నా. ఈ దేశ ప్రజల కోసం ఏ రివల్యూషన్ తీసుకొచ్చారు? మీ పార్టీ దేని కోసం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం నడిపేందుకు మాత్రమే మీరు ప్రయత్నిస్తున్నారు. రైతులను పట్టించుకోవడం లేదు. నార్త్ ఇండియా నుంచి ఎవరైనా ప్రధాని అయితే రాష్ట్రపతి పదవి దక్షిణాది వారికి ఇచ్చే సాంప్రదాయం కాంగ్రెస్ హాయాంలో (CM Revanth Reddy ABP Southern Rising) ఉండేది. బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటిది లేదు. కేసీఆర్ (KCR) ఫ్రీడం ఫైటర్ అని క్లెయిమ్ చేసుకుంటాడు. నాకేమీ అభ్యంతరం లేదు. తన ఫాంహౌస్‌లో పడుకొంటాడు. పదేళ్లలో ఒక్కసారి సచివాలయానికి రాలేదు. గత పది నెలల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు. మీకు డెమొక్రసీపై గౌరవం ఉంటే ఎందుకు రావట్లేదు. కేసీఆర్ జమిందార్, మేం గులాంలని ఆయన అనుకుంటాడు’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.