Hyderabad Cloud Burst | భాగ్యనగరంలో కుండపోత...అల్లాడి పోయిన ప్రజలు | ABP Desam

 హైదరాబాద్  లో క్లౌడ్ బరస్ట్ అయ్యింది. ప్రత్యేకించి నగరం వెస్ట్ పార్ట్ వణికిపోయింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కృష్ణానగర్, అమీర్ పేట్ వరకూ వర్ష బీభత్సం కనిపించింది. రోడ్లపైకి సముద్రం వచ్చేసిందా అనేంత స్థాయిలో వరద ప్రవాహం కనిపించింది. సౌత్ సైడ్ హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్ లోనూ భారీ వర్షం కురిసింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇలా జరిగిందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ చెబుతున్నారు. కొన్ని చోట్ల 8నుంచి 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అందరూ సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola