Rosaiah Passes Away: రోశయ్య మరణంపై ప్రముఖుల సంతాపం.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే రోశయ్య తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. రోశయ్య మృతికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య అకాల మరణం షాక్‌కి గురి చేసిందన్నారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని కామెంట్ చేశారు. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరన్నారు రేవంత్ రెడ్డి. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు