Charminar Express Derails At Nampally Railway Station: ప్రమాదంపై లోకోపైలట్ ను విచారిస్తున్న కమిటీ సభ్యులు

నాంపల్లి రైల్వేస్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదం గురించి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఐదో నంబర్ ప్లాట్ ఫాం డెడ్ ఎండ్ వద్ద గోడకు రైలు బోగీలు ఢీకొన్నాయి. లోకోపైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎస్1,2,3 బోగీలు పట్టాలు తప్పగా, వాటిని రైల్వే అధికారులు పునరద్ధరిస్తున్నారు. రైలు ప్రమాదంపై దక్షిణమధ్య రైల్వేశఖ విచారణకు ఆదేశించింది. విచారణ కమిటీ సభ్యులు లోకోపైలట్ ను విచారిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola